`భీష్మ`లో ఆ హీరోయిన్ కూడా ఉందా?

ABN , First Publish Date - 2020-02-18T18:12:17+05:30 IST

నితిన్, రష్మిక హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ వెంకీ కుడుముల రూపొందించిన తాజా చిత్రం `భీష్మ`.

`భీష్మ`లో ఆ హీరోయిన్ కూడా ఉందా?

నితిన్, రష్మిక హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ వెంకీ కుడుముల రూపొందించిన తాజా చిత్రం `భీష్మ`. ఈ నెల 21వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ కూడా ఉందట. ఈ సినిమాలో మరో హీరోయిన్ కీలక పాత్రలో కనిపించనుందట. 


`కుమారి 21ఎఫ్` సినిమాతో తెలుగువారికి చేరువైన హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ సినిమాలో ఓ పాత్ర చేసిందని సమాచారం. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో హెబ్బా మెరవనుందట. సినిమా అంతా కనిపించకపోయినా హెబ్బాకు `భీష్మ` సినిమాలో గుర్తిండిపోయే పాత్ర దొరికిందని తెలుస్తోంది. మరి, ఈ వార్త నిజమో, కాదో తెలియాలంటే మరో మూడ్రోజులు ఆగాల్సిందే.   


Updated Date - 2020-02-18T18:12:17+05:30 IST