ప్రభాస్ మరో షాకింగ్ ప్రకటన?

ABN , First Publish Date - 2020-08-31T21:12:41+05:30 IST

ఒక్కో సినిమా కోసం రెండుమూడేళ్లు కేటాయిస్తూ చాలా గ్యాప్ తీసుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నాడు

ప్రభాస్ మరో షాకింగ్ ప్రకటన?

ఒక్కో సినిమా కోసం రెండుమూడేళ్లు కేటాయిస్తూ చాలా గ్యాప్ తీసుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నాడు. వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం `రాధేశ్యామ్` చేస్తున్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కు ఓకే చెప్పాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే మరో భారీ సినిమాను ప్రకటించాడు. 


బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించనున్న భారీ బడ్జెట్ సినిమా `ఆది పురుష్`లో నటించబోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలను ఎప్పటికి పూర్తి చేస్తాడనే చర్చ ప్రస్తుతం సాగుతోంది. తాజాగా మరో సినిమాకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ అగ్ర దర్శకుడితో ప్రభాస్ త్వరలో జత కట్టబోతున్నాడట. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనుందట. త్వరలోనే ఈ సినిమా ప్రకటన కూడా రాబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-08-31T21:12:41+05:30 IST