'బిగ్ బాస్ -4'లో బిత్తిరి సత్తి!

ABN , First Publish Date - 2020-06-29T01:58:58+05:30 IST

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రియాలిటీ షో మజాని పరిచయం చేసిన కార్యక్రమం 'బిగ్ బాస్'. తెలుగునాట ఈ షో..

'బిగ్ బాస్ -4'లో బిత్తిరి సత్తి!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రియాలిటీ షో మజాని పరిచయం చేసిన కార్యక్రమం 'బిగ్ బాస్'. తెలుగునాట ఈ షో ఇప్పటివరకు మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కోసం నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా 'బిగ్ బాస్' యాజమాన్యం  బిత్తిరి సత్తిని  'బిగ్ బాస్- 4' లో పాల్గొనాల్సిందిగా కోరిందట. ఈ వెర్సటైల్ యాంకర్‌కి మాస్ సెక్షన్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ కారణంగానే సత్తికి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట 'బిగ్ బాస్' నిర్వాహకులు. 


తెలంగాణ యాస, భాషతో మీడియా రంగంలో తనకంటూ ఓ యూనిక్ స్టైల్‌ని క్రియేట్ చేసుకోగలిగాడు బిత్తిరి సత్తి. నిజానికి ఈయన 'బిగ్ బాస్'లో ఇదివరకే కనిపించాల్సిందట. 'బిగ్ బాస్' మూడు సీజన్స్‌లో సత్తికి ముందుగా ఆఫర్ దక్కినా.., ఎందుకనో ఆసక్తి చూపించలేదట. అయితే  ఇప్పుడు ఎట్టకేలకు 'బిగ్ బాస్' సీజన్ 4కి సత్తి అంగీకరించారన్న టాక్ బయటకి రావడంతో  ప్రేక్షకులలో అప్పుడే బజ్ మొదలయింది. మరి త్వరలోనే ప్రారంభం కానున్న 'బిగ్ బాస్-4'లో బిత్తిరి సత్తితో పాటు.. పాల్గొనే పార్టిసిపెంట్స్ ఎవరో తెలియాలంటే మరికొంతకాలం ఎదురు చూడాల్సిందే. 

Updated Date - 2020-06-29T01:58:58+05:30 IST