రంగ‌మ్మ‌త్త బాలీవుడ్ ఎంట్రీ..!

ABN , First Publish Date - 2020-05-11T14:29:41+05:30 IST

ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన అన‌సూయ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను కూడా ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

రంగ‌మ్మ‌త్త బాలీవుడ్ ఎంట్రీ..!

బుల్లితెర‌కి గ్లామ‌ర్ హంగులు అద్ది హాట్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకుంది అన‌సూయ భ‌రద్వాజ్‌. బుల్లితెర‌పై క్రేజ్ వ‌చ్చిన త‌ర్వాత వెండితెర‌పై కూడా మంచి పాత్ర‌ల‌ను పోషించిందీ అమ్మ‌డు. అందులో ‘క్ష‌ణం’, ‘రంగ‌స్థ‌లం’లో అన‌సూయ పోషించిన పాత్ర‌లు ఆమెకు చాలా మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన అన‌సూయ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను కూడా ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆమెకు బాలీవుడ్‌లో అవ‌కాశం వ‌చ్చింద‌ని, అయితే సినిమాలో కాదు.. సీరియ‌ల్‌లో అని టాక్‌. హిందీలో టాప్ రేటెడ్ సీరియ‌ల్‌లో ఓ కీల‌క పాత్ర కోసం అన‌సూయ‌ను మేక‌ర్స్ సంప్ర‌దించారంటున్నారు. మరి ఈ వార్తలపై అనసూయ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Updated Date - 2020-05-11T14:29:41+05:30 IST