విలన్ పాత్రలో అనసూయ?

ABN , First Publish Date - 2020-02-18T17:34:12+05:30 IST

బుల్లితెర మీద హాట్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అనసూయ.

విలన్ పాత్రలో అనసూయ?

బుల్లితెర మీద హాట్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అనసూయ. బుల్లితెర మీద పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న అనసూయ వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. `రంగస్థలం` సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనసూయ ఖాతాలో పలు సినిమాలున్నాయట. 


అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాలో అనసూయకు కీలక పాత్ర లభించినట్టు సమాచారం. అలాగే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్-క్రిష్ కలయికలో రూపొందబోతున్న సినిమాలోనూ అనసూయ ఛాన్స్ దక్కించుకుందట. ఇక, యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మించనున్న ఓ చిత్రంలో కూడా అనసూయ నటించబోతోందట. ఈ సినిమాలో అనసూయది విలన్ రోల్ అని తెలుస్తోంది. గతంలో `క్షణం` సినిమాలో అనసూయ ప్రతినాయకురాలిగా కనిపించిన సంగతి తెలిసిందే. మరోసారి ఆ తరహా పాత్రకు అనసూయ ఓకే చెప్పిందట. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయట.  

Updated Date - 2020-02-18T17:34:12+05:30 IST