‘ఆదిపురుష్‌’ సీతగా ఆమె పేరు.. వద్దంటోన్న నెటిజన్లు

ABN , First Publish Date - 2020-11-14T04:42:54+05:30 IST

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించబోతోన్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘ఆదిపురుష్‌’మీద గాసిప్స్‌ అస్సలు ఆగడం లేదు. ఏదో ఒక గాసిప్‌తో నిత్యం ఈ సినిమా పేరు

‘ఆదిపురుష్‌’ సీతగా ఆమె పేరు.. వద్దంటోన్న నెటిజన్లు

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించబోతోన్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘ఆదిపురుష్‌’మీద గాసిప్స్‌ అస్సలు ఆగడం లేదు. ఏదో ఒక గాసిప్‌తో నిత్యం ఈ సినిమా పేరు వార్తల్లోనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు మరో గాసిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రభాస్‌, సైఫ్‌ అలీఖాన్‌ల పేర్లు అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్‌ సీత పాత్ర చేసే నటీమణి కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎందరో హీరోయిన్ల పేరు ఈ పాత్రకి వినబడ్డాయి. ఇప్పుడు తాజాగా విజయ్‌ దేవరకొండతో 'ఫైటర్‌' చిత్రంలో చేస్తున్న అనన్యపాండే పేరు వినబడుతోంది. సోషల్‌ మీడియాలో ‘ఆదిపురుష్‌’లో సీతగా అనన్యపాండే చేస్తుందనే వార్త విన్న నెటిజన్లు మాత్రం.. అవాక్కవుతున్నారట. ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే.. సీతగా ఆమె వద్దు బాబోయ్‌ అంటున్నారట. ఫైనల్‌గా ఈ పాత్రకు ఎవరు ఫిక్స్‌ అవుతారో తెలియదు కానీ.. ఇటువంటి గాసిప్స్‌ మాత్రం విపరీతంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. 

Updated Date - 2020-11-14T04:42:54+05:30 IST