సినిమా కోసం వంటవాడిగా మారిన ఆనంద్ దేవరకొండ

ABN , First Publish Date - 2020-07-12T20:13:22+05:30 IST

ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ బ్యానర్ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

సినిమా కోసం వంటవాడిగా మారిన ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవ‌ర‌కొండ‌..యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడిగా ‘దొర‌సాని’ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి చిత్రంతోనే నటుడిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు ఆనంద్ దేవరకొండ. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ బ్యానర్ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం తాను వంట నేర్చుకున్నాన‌ని ఆనంద్ దేవ‌ర‌కొండ తెలిపారు. ఓ ఆంగ్ల ప‌త్రిక‌తో మాట్లాడుతూ ‘అమెరికాలో మాస్ట‌ర్స్ కోర్సు చ‌దివే స‌మ‌యంలో వంట చేసేవాడిని కానీ.. అంత ఫ‌ర్‌ఫెక్ట్‌గా అయితే కాదు. కానీ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా కోసం దోస చేయ‌డం, చ‌ట్నీ త‌యారు చేయ‌డం నేర్చుకున్నాను’ అని తెలిపారు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. 

Updated Date - 2020-07-12T20:13:22+05:30 IST