అమితాబ్‌కు అంత మొత్తమా..!

ABN , First Publish Date - 2020-12-02T17:44:24+05:30 IST

దక్షిణాది సినిమాలన్నీ ప్యాన్‌ ఇండియా లెవల్లో రూపొందుతున్నాయి. దానికి తగ్గట్లు ప్యాన్‌ ఇండియా ఆర్టిస్టులను తన సినిమాల్లో నటింప చేస్తున్నారు మన దర్శక నిర్మాతలు.

అమితాబ్‌కు అంత మొత్తమా..!

దక్షిణాది సినిమాలన్నీ ప్యాన్‌ ఇండియా లెవల్లో రూపొందుతున్నాయి. దానికి తగ్గట్లు ప్యాన్‌ ఇండియా ఆర్టిస్టులను తన సినిమాల్లో నటింప చేస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా  ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో విజనరీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో  ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొనె నటిస్తుండగా.. కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. కాగా..ఈ సినిమాలో అమితాబ్‌కు ఎంత రెమ్యునరేషన్‌ ఇస్తారనే దానిపై సోషల్‌ మీడియాలో చాలా రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు అమితాబ్‌కు రూ.21 కోట్లు రెమ్యనరేషన్‌ ముడుతుందట. దీపికా పదుకొనెకు కూడా పదిహేను కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు టాక్‌. ప్యాన్‌ ఇండియా మూవీ అంటే ఆమాత్రం ఖర్చు పెట్టాల్సిందేనని మరికొందరు అంటున్నారు. 


Updated Date - 2020-12-02T17:44:24+05:30 IST