స్టార్ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెడుతున్న బన్నీ!

ABN , First Publish Date - 2020-07-16T01:14:17+05:30 IST

ఈ ఏడాది సంక్రాంతికి `అల వైకుంఠపురములో..` సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ విజయం అందుకున్నాడు.

స్టార్ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెడుతున్న బన్నీ!

ఈ ఏడాది సంక్రాంతికి `అల వైకుంఠపురములో..` సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ విజయం అందుకున్నాడు. త్వరలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న `పుష్ప` సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే రెండు సినిమాల గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. 


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య` రూపొందిస్తున్న అగ్ర దర్శకుడు కొరటాల శివ తర్వాతి సినిమాలో బన్నీ కనిపించబోతున్నాడట. బన్నీ కోసం కొరటాల ఇప్పటికే కథ సిద్ధం చేశారట. ఇటీవల బన్నీని కలిసి కథ వినిపించారట. `పుష్ప` తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుందట. కొరటాల తర్వాత మరోసారి త్రివిక్రమ్‌తో కలిసి బన్నీ పనిచేయబోతున్నాడట. `అల వైకుంఠపురములో..` సినిమాతో నాన్-బాహుబలి రికార్డులను తుడిచిపెట్టేసిన వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయబోతున్నారట. 


Updated Date - 2020-07-16T01:14:17+05:30 IST