`రేసుగుర్రం` కాంబినేషన్ రిపీట్ అవుతోందా?

ABN , First Publish Date - 2020-05-26T22:22:39+05:30 IST

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన `రేసుగుర్రం` చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది.

`రేసుగుర్రం` కాంబినేషన్ రిపీట్ అవుతోందా?

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన `రేసుగుర్రం` చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుని రికార్డులు సృష్టించింది. త్వరలో ఈ కాంబినేషన్ రిపీట్ కానుందట. మరోసారి ప్రేక్షకులకు వినోదం అందించేందుకు సిద్ధమవుతోందట.


సురేందర్ రెడ్డి, బన్నీ కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా తెరకెక్కనుందట. `రేసుగుర్రం` సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ సినిమా కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న `పుష్ప` తర్వాత సురేందర్ రెడ్డి సినిమాను పట్టాలెక్కించాలని బన్నీ అనుకుంటున్నాడట.  

Updated Date - 2020-05-26T22:22:39+05:30 IST