బ‌న్నీ హీరోగా కొర‌టాల శివ సినిమా..?

ABN , First Publish Date - 2020-06-12T16:30:54+05:30 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌నుంద‌ట.

బ‌న్నీ హీరోగా కొర‌టాల శివ సినిమా..?

కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ గురించి తెలుసుకోగానే సినీ ప్రియుల్లో తెలియ‌ని ఆస‌క్తి నెల‌కొంటుంది. ప్రేక్ష‌కుల్లోనే కాదు.. ట్రేడ్ వ‌ర్గాల్లోనూ వీరి కాంబినేష‌న్‌లో సినిమా గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి ఓ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నుంది లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం. సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌నుంద‌ట. ప్ర‌స్తుతం బ‌న్నీ పాన్ ఇండియా చిత్రం పుష్ప‌ను పూర్తి చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. మ‌రో ప‌క్క కొర‌టాల శివ మెగాస్టార్‌తో ఆచార్య సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. వీరిద్ద‌రూ ఈ రెండు సినిమాల‌ను పూర్తి చేసుకున్న త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో సినిమా మొద‌ల‌వుతుంద‌ని టాక్‌.  

Updated Date - 2020-06-12T16:30:54+05:30 IST