డిజిట‌ల్‌లో అల్ల‌రి న‌రేశ్ సినిమా

ABN , First Publish Date - 2020-06-12T18:43:35+05:30 IST

నిర్మాత‌లు బంగారుబుల్లోడు చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ‌తో నిర్మాత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

డిజిట‌ల్‌లో అల్ల‌రి న‌రేశ్ సినిమా

అల్ల‌రి న‌రేశ్‌.. నేటి త‌రం కుర్ర హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. చాలా త్వ‌ర‌గా 50 సినిమాల‌ను కూడా పూర్తి చేశాడు. అయితే గ‌త కొంత‌కాలంగా అల్ల‌రి న‌రేశ్ న‌టించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద స‌క్సెస్ కాలేదు. ప్ర‌స్తుతం నాంది సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నాడు న‌రేశ్‌. అయితే ఈ సినిమా కంటే ముందుగా న‌రేశ్ న‌టించిన బంగారు బుల్లోడు సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో థియేట‌ర్స్ ఓపెన్ అయ్యే విష‌యంలో క్లారిటీ రావ‌డం లేదు. వ‌చ్చినా ఈ సినిమా త‌గిన‌న్ని థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుందా? అనేది అనుమానంగా మారింది. దీంతో నిర్మాత‌లు బంగారుబుల్లోడు చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ‌తో నిర్మాత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Updated Date - 2020-06-12T18:43:35+05:30 IST