'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం పాట పాడనున్న ఆలియా

ABN , First Publish Date - 2020-10-30T23:01:16+05:30 IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియాభట్‌ మంచి సింగర్‌ కూడా. హైవే, హంప్టీ శర్మకీ దుల్హనియా చిత్రాల్లో తన స్వర గాత్రంతో ఆలియా అలరించిన సంగతి తెలిసిందే.

'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం పాట పాడనున్న ఆలియా

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియాభట్‌ మంచి సింగర్‌ కూడా. హైవే, హంప్టీ శర్మకీ దుల్హనియా చిత్రాల్లో తన స్వర గాత్రంతో ఆలియా అలరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఈమె మరోసారి తన గొంతును సవరించుకోనున్నారట. వివరాల్లోకెళ్తే.. ఆలియాభట్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ప్యాన్‌ ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో సీత పాత్రలో ఆలియా భట్‌ నటించనున్నారు. కాగా.. ఈ సినిమాలో ఆలియాభట్‌, రామ్‌చరణ్‌పై ఓ సాంగ్‌ కూడా ఉంది. ఈ సాంగ్‌ను ఆలియాభట్‌ ఆలపించనున్నారట. అయితే తెలుగు,తమిళ భాషల్లో ఉచ్చారణ కష్టం కాబట్టి ఆలియా హిందీలో మాత్రమే ఈ పాటను పాడనున్నారని సమాచారం. 


Updated Date - 2020-10-30T23:01:16+05:30 IST