`ఆర్ఆర్ఆర్`: ఆలియా మార్పు నిజం కాదా?

ABN , First Publish Date - 2020-08-25T22:15:03+05:30 IST

వెండితెర అరంగేట్రం చేసిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది హీరోయిన్ ఆలియా భట్.

`ఆర్ఆర్ఆర్`: ఆలియా మార్పు నిజం కాదా?

వెండితెర అరంగేట్రం చేసిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ఆలియా భట్. పలువురు అగ్ర హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంది. అయితే ఇటీవల యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఆలియా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. సుశాంత్ గురించి గతంలో ఆలియా చెడుగా మాట్లాడడం, ఆమె స్టార్ వారసత్వం, సుశాంత్ కేసులో ఆమె తండ్రి మహేష్ భట్ పాత్ర గురించి వస్తున్న వార్తలు.. మొదలైన వాటి కారణంగా ఆలియాపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. ఆమె సినిమా ట్రైలర్‌పై రికార్డు స్థాయిలో డిస్ లైకుల వర్షం కురిపించారు. ఆలియా వల్ల `ఆర్ఆర్ఆర్`కు ఖచ్చితంగా నష్టం జరుగుతుందని, అందుకే ఆమెను సినిమా నుంచి తొలగించారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు అవాస్తవాలేనని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్` నుంచి ఆలియాను తొలగించాలనే ఆలోచనే తమకు రాలేదని రాజమౌళి క్యాంప్ స్పష్టం చేస్తోంది. అలాగే ఆలియా టీమ్ కూడా ఈ వార్తలను ఖండించింది. 


Updated Date - 2020-08-25T22:15:03+05:30 IST