మే నెలలో అక్కినేని బ్రదర్స్ సందడి
ABN , First Publish Date - 2020-03-04T21:38:29+05:30 IST
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కథానాయకులు ఒకే నెలలో తమ తమ కొత్త చిత్రాలతో పలకరించడం అప్పుడప్పుడు చోటుచేసుకునేదే.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కథానాయకులు ఒకే నెలలో తమ తమ కొత్త చిత్రాలతో పలకరించడం అప్పుడప్పుడు చోటుచేసుకునేదే. అలా... ఈ ఏడాది మే నెలలో 'అక్కినేని బ్రదర్స్' నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ సందడి చేయనున్నారు. 'లవ్ స్టోరి'తో నాగచైతన్య పలకరించనుండగా... 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'గా అఖిల్ రాబోతున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే... తక్కువ గ్యాప్ లో తెరపైకి రానున్న ఈ రెండు సినిమాలు కూడా ప్రేమకథలతోనే తెరకెక్కుతున్నాయి. వేసవిలో సందడి చేయనున్న 'అక్కినేని బ్రదర్స్' చిత్రాలు రెండు కూడా... ఆంగ్ల శీర్షికలతోనే తెరకెక్కుతుండడం విశేషం. 'లవ్ స్టోరి', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'... ఇలా ఇంగ్లీష్ టైటిల్స్ తోనే చైతూ, అఖిల్ రాబోతున్నారు. మరి... మే మాసం ఈ 'అక్కినేని బ్రదర్స్'కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.