అఖిల్ టైటిల్ ఇదేనా?

ABN , First Publish Date - 2020-02-03T20:00:29+05:30 IST

అక్కినేని మూడో త‌రం న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

అఖిల్ టైటిల్ ఇదేనా?

అక్కినేని మూడో త‌రం న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాల‌తో అఖిల్ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న వంతుగా చేసిన స‌క్సెస్ ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని అఖిల్ త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.. మ‌రోవైపు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌కి కూడా హిట్ అవ‌స‌రం. ఈయ‌న కూడా హిట్ కొట్టాల‌నే త‌ప‌న‌తో సినిమా చేస్తార‌న‌డంలో సందేహం ఉండ‌దు. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్నఈ సినిమా టైటిల్‌ను ఫిబ్ర‌వ‌రి 4న అనౌన్స్ చేయ‌బోతున్నారు. అయితే సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజా నిజాలు తెలియాలంటే ఈ నెల 4వ‌ర‌కు ఆగాల్సిందే.

Updated Date - 2020-02-03T20:00:29+05:30 IST