అఖిల్ సినిమాపై వస్తున్న వార్తల్లో నిజంలేదట

ABN , First Publish Date - 2020-05-12T04:06:19+05:30 IST

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’. అన్నీ బాగుంటే

అఖిల్ సినిమాపై వస్తున్న వార్తల్లో నిజంలేదట

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’. అన్నీ బాగుంటే ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉండేది. కానీ కరోనా రూపంలో ఈ చిత్రం ఎడిటింగ్ టేబుల్‌పైనే ఆగిపోయింది. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమాపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కింగ్ నాగార్జున ఈ సినిమా చూశారని, ఫైనల్ అవుట్‌పుట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారనే రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. దీంతో అక్కినేని అభిమానుల్లో నిరాశ మొదలైంది.


అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అసలు ఇంత వరకు ఈ సినిమాకు సంబంధించి ఎడిటింగ్ పనులు మొదలవ్వలేదట. అలాగే కింగ్ నాగార్జున కూడా ఈ సినిమా చూడలేదట. చూడకుండానే అసంతృప్తి వ్యక్తం చేయడం ఏమిటో అని చిత్రయూనిట్ నవ్వుకుంటున్నారట. సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు అంతే లేకుండా పోతుందని, రూమర్స్ పుట్టించవచ్చుకానీ, మరీ ఈ రేంజ్‌లోనా అంటూ చిత్రయూనిట్ ఆశ్చర్యం వ్యక్తంచేసినట్లుగా టాక్ నడుస్తుంది.  

Updated Date - 2020-05-12T04:06:19+05:30 IST