అఖిల్‌కు నిర్మాతలు దొరికారు..!!
ABN , First Publish Date - 2020-08-25T19:31:26+05:30 IST
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’గా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు హీరో అఖిల్ అక్కినేని.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’గా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు హీరో అఖిల్ అక్కినేని. ఈ యంగ్ హీరో తదుపరి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ముందుగా జాగర్లమూడి క్రిష్, రాజీవ్ రెడ్డి నిర్మిస్తారని వార్తలు వినిపించాయి. కానీ.. చివరకు వారు తప్పుకోవడంతో, 14 రీల్స్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్ వినిపిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత అఖిల్ పెండింగ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ను పూర్తి చేసి, సురేందర్ రెడ్డి సినిమాను స్టార్ట్ చేస్తారని సమాచారం.