గ్యాప్‌ వద్దంటున్న అజిత్‌

ABN , First Publish Date - 2020-12-02T13:34:39+05:30 IST

అజిత్..న 60వ సినిమా 'వలిమై'ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆరేడు నెలలు ఇంటికే పరిమితమైన అజిత్‌ రీసెంట్‌గానే హైదరాబాద్‌లో ఓ యాక్షన్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశాడు.

గ్యాప్‌ వద్దంటున్న అజిత్‌

తమిళ చిత్రసీమలోని అగ్ర కథానాయకుల్లో అజిత్‌ ఒకరు. ప్రస్తుతం ఈ స్టార్‌ తన 60వ సినిమా 'వలిమై'ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆరేడు నెలలు ఇంటికే పరిమితమైన అజిత్‌ రీసెంట్‌గానే హైదరాబాద్‌లో ఓ యాక్షన్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. త్వరలోనే నెక్ట్స్‌ షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడట. కంటిన్యూ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేయమని దర్శక నిర్మాతలకు అజిత్‌ చెప్పేశాడట. వచ్చే ఏడాది జనవరి చివరికంతా 'వలిమై' షూటింగ్‌ పూర్తి చేసేయాలనేది అజిత్‌ ఆలోచనగా కనిపిస్తుంది. బాలీవుడ్‌ మూవీ 'పింక్‌' తమిళ రీమేక్ 'నేర్కొండ పార్వ్యై' తర్వాత అజిత్‌, డైరెక్టర్‌ వినోద్‌, నిర్మాత బోనీ కపూర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. హ్యుమూ ఖురేషి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటిస్తున్నాడు. 


Updated Date - 2020-12-02T13:34:39+05:30 IST