బాలీవుడ్‌లో అడుగు పెడుతున్న మ‌రో సౌత్ హీరో!!

ABN , First Publish Date - 2020-07-29T18:57:53+05:30 IST

మ‌రో సౌత్ స్టార్ హీరో కూడా ఉత్త‌రాదిన హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ట‌. ఇంత‌కూ ఆ హీరో ఎవ‌రో తెలుసా? అజిత్‌.

బాలీవుడ్‌లో అడుగు పెడుతున్న మ‌రో సౌత్ హీరో!!

ఇప్పుడు క్ర‌మంగా ద‌క్షిణాది, ఉత్త‌రాది సినిమాలు మ‌ధ్య హ‌ద్దులు చెరిగిపోతున్నాయి. డిజిట‌ల్ మీడియాకు ఆద‌ర‌ణ పెరుగుతున్న క్ర‌మంలో ప్రేక్ష‌కులు భాష ప‌ర‌మైన హ‌ద్దుల‌తో సినిమాలు చూడటం లేదు. దీంతో కొన్నేళ్ల క్రితం వ‌ర‌కు ద‌క్షిణాదికే ప‌రిమిత‌మైన మ‌న హీరోలు ఉత్త‌రాది మార్కెట్‌పై కన్నేశారు. దీంతో మ‌న దక్షిణాది సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలుగా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ప్రారంభించాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇప్పుడు మ‌రో సౌత్ స్టార్ హీరో కూడా ఉత్త‌రాదిన హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ట‌. ఇంత‌కూ ఆ హీరో ఎవ‌రో తెలుసా? అజిత్‌. ప్ర‌స్తుతం ఈయ‌న అజిత్ క‌థానాయ‌కుడిగా వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో వినోద్ ద‌ర్వ‌క‌త్వంలో ‘వ‌లిమై’ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళంతో పాటు హిందీలోనూ విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని టాక్‌. క‌రోనా కార‌ణంగా ‘వలిమై’ చిత్రీకరణ ఆగింది. ఈ పరిస్థితులు చక్కబడ్డ తర్వాత షూటింగ్ మొదలు పెట్టనున్నారు. 

Updated Date - 2020-07-29T18:57:53+05:30 IST