పవన్ సినిమాలో ఐశ్వర్య?

ABN , First Publish Date - 2020-11-03T14:54:12+05:30 IST

గ్లామరస్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది తమిళ భామ ఐశ్వర్యా రాజేష్

పవన్ సినిమాలో ఐశ్వర్య?

గ్లామరస్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది తమిళ భామ ఐశ్వర్యా రాజేష్. తెలుగులో ఇప్పటికే మంచి పాత్రలు చేసిన ఐశ్వర్యకు ఇటీవలి కాలంలో అవకాశాలు బాగా పెరిగాయి. రాజమౌళి `ఆర్ఆర్ఆర్`లో గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య కనిపించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అది ఇంకా అధికారికం కాదు. 


తాజాగా మరో భారీ సినిమాలో ఐశ్వర్య నటించబోతందంటూ వార్తలు ప్రారంభమయ్యాయి. `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌లో కూడా ఐశ్వర్య కనిపించబోతోందని టాలీవుడ్ టాక్. ఆ సినిమాలో పవన్‌కు జోడీగా ఐశ్వర్యను తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంది. ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. ఆ పాత్రకు మొదట సాయిపల్లవి పేరు వినిపించింది. తాజాగా ఐశ్వర్య పేరు తెర మీదకు వచ్చింది. ఈ ఆఫర్ ఐశ్వర్యకు వస్తే తెలుగులో ఆమెకు మరిన్ని మంచి రోల్స్ వచ్చే ఛాన్సుంది. 

Updated Date - 2020-11-03T14:54:12+05:30 IST