నటి సంజనపై మరోసారి సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2020-09-20T01:45:26+05:30 IST

డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన శాండిల్ వుడ్ బ్యూటీ, బహుబాష నటి సంజనా గల్రాని పేరు మరోసారి శాండిల్‌ వుడ్‌లో హైలెట్‌ అవుతుంది. ఆమె

నటి సంజనపై మరోసారి సంచలన ఆరోపణలు

డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన శాండిల్ వుడ్ బ్యూటీ, బహుబాష నటి సంజనా గల్రాని పేరు మరోసారి శాండిల్‌ వుడ్‌లో హైలెట్‌ అవుతుంది. ఆమె మతం మార్చుకున్నారు? అనే ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. శాండిల్ వుడ్ చిత్రపరిశ్రమకు డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉంది? అనే ఆరోపణలు మొదలైనప్పటి నుంచి నటి సంజనా, రాగిణి దివ్వేది పేర్లు తెరమీదకు రావడం, ఆ ఇద్దరు అరెస్టు అయ్యి జైలుకు వెళ్లడం అనేవి తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు నటి సంజనాపై మరో ఆరోపణ తెరమీదకు వచ్చింది. 


లవ్ జీహాద్ దెబ్బతో నటి సంజనా మతం మార్చుకుని ఆమె పేరును మహిరాగా మార్చుకున్నారని ప్రముఖ ఆర్‌టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి సంచలన ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు ఉలిక్కిపడ్డారు. లవ్ జీహాద్‌లో భాగంగా లవర్ అజీజ్ దెబ్బతో నటి సంజనా మతం, ఆమె పేరు మార్చుకున్నారని ఆరోపణలు రావడం నిజంగా కలకలం రేపే విషయమే. శాండిల్ వుడ్ బ్యూటీక్వీన్ సంజనా మీద మొదటి నుంచి ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. 2018లో నటి సంజనా హిందూ మతం మారిపోయారని ప్రశాంత్ సంబర్గి ఆరోపిస్తున్నారు. 2018లోనే నటి సంజనా ఇస్లాం మతం స్వీకరించి ఆమె పేరును మహిరాగా మార్చుకున్నారని ప్రశాంత్ సంబర్గి ఆయన ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు.

 


బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. నటి సంజనా గల్రానీని అరెస్టు చేసి చార్జ్ షీటు తయారు చేసి కోర్టులో సమర్పించారు. వారం రోజులకు పైగా నటి సంజనాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జ్ షీటులో నటి సంజనా గల్రాని అనే ఆమె పేరు నమోదైయ్యిందని, మహిరా అనే పేరు ఎక్కడా లేదని తెలుస్తుంది.


అయితే సంజనా గల్రాని, ప్రముఖ వైద్యుడు అజీజ్ అనేక సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, ఇప్పటికే ఇస్లాం మతం ఆచారం ప్రకారం డాక్టర్ అజీజ్, నటి సంజనా నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లుగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ, లాక్‌డౌన్ కారణంగా వారి పెళ్లి వాయిదా పడినట్లుగా సమాచారం. ఈ నిశ్చితార్థ ఫొటోలనే చూపిస్తూ.. ప్రశాంత్ సంబర్గి ఇక ముందు నటి సంజనా అలియాస్ అర్చనా మనోహర్ గల్రానిని ఆ పేర్లతో పిలవకూడదని, ఆమె ఇస్లాం మతం స్వీకరించిందని, ఆమెను మహిరా అని పిలవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుతం బెంగళూరులోని చామరాజపేట నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ తో కలిసి నటి సంజనా శ్రీలంక టూర్‌కు వెళ్లారని కూడా ఆయన ఆరోపించారు.


ఇలా ఒకదాని తర్వాత ఒకటి నటి సంజనా మెడికి చుట్టుకుంటుండటంతో.. ఆమె వ్యవహారం ఎక్కడికిపోయి ఎక్కడికి వస్తుందో? అనే విషయం అంతు చిక్కకపోవడంతో ఆమె అభిమానులు సన్నిహితులు అయోమయానికి గురౌతున్నారు. తాను మాత్రం సంజనా వ్యవహారం మొత్తం బయట పెడుతానని, ఆమె భాగోతం మొత్తం ప్రజలకు వివరిస్తానని ప్రశాంత్ సంబర్గి పదేపదే చెబుతున్నారు. దీంతో లవ్ జీహాద్ దెబ్బతో నటి సంజనా ఇస్లాం మతం స్వీకరించి మహిరాగా పేరు మార్చుకున్నారా? లేదా? అనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

Updated Date - 2020-09-20T01:45:26+05:30 IST