ఆన్‌లైన్‌లో అడివిశేష్ శిక్ష‌ణ‌

ABN , First Publish Date - 2020-04-25T13:26:18+05:30 IST

కొంద‌రు యాక్ట‌ర్స్ నటించే స‌మ‌యంలో ప్ర‌తి చిన్న డీటెయిలింగ్ ప‌రంగా క‌చ్చిత‌త్వాన్ని పాటిస్తారు. అలాంటి వారిలో అడివిశేష్ ఒక‌రు. క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత శేష్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మేజ‌ర్‌’.

ఆన్‌లైన్‌లో అడివిశేష్ శిక్ష‌ణ‌

కొంద‌రు యాక్ట‌ర్స్ నటించే స‌మ‌యంలో ప్ర‌తి చిన్న డీటెయిలింగ్ ప‌రంగా క‌చ్చిత‌త్వాన్ని పాటిస్తారు. అలాంటి వారిలో అడివిశేష్ ఒక‌రు. క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత శేష్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మేజ‌ర్‌’. 26/11 దాడుల్లో చ‌నిపోయిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో ఉన్ని కృష్ణ‌న్ జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఏదో ఆషా మాషీగా పాత్ర‌ను చేసేయాల‌ని కాకుండా శేష్ మాజీ ఆర్మీ అధికారుల నుండి ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ శేష్‌.. ఆన్‌లైన్‌లో స‌ద‌రు మాజీ అధికారుల నుండి శిక్ష‌ణ‌ను తీసుకుంటున్నాడ‌ట‌. మ‌హేశ్‌బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సోనీ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమ‌లో శోభితా దూళిపాళ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

Updated Date - 2020-04-25T13:26:18+05:30 IST