శర్వాతో అదితి?

ABN , First Publish Date - 2020-08-14T18:23:32+05:30 IST

ప్రతిభ గల నటిగా నిరూపించుకున్న హీరోయిన్ అదితీ రావు హైదరీకి టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి

శర్వాతో అదితి?

ప్రతిభ గల నటిగా నిరూపించుకున్న హీరోయిన్ అదితీ రావు హైదరీకి టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. `ఆర్ఎక్స్100` దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించనున్న `మహాసముద్రం` సినిమాలో కీలక పాత్ర అదితికి దక్కిందట. ఆ సినిమా కథ విని అదితి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. 


ఈ మల్టీ స్టారర్ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించబోతున్నారట. శర్వా సరసన హీరోయిన్‌గా అదితి కనిపించనుందట. ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. సిద్ధార్థ్ సరసన నటించబోయే హీరోయిన్‌ను కూడా ఫిక్స్ చేసి ఈ నెలలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-08-14T18:23:32+05:30 IST