`ఆచార్య`.. బడ్జెట్ తగ్గిస్తున్నారా?

ABN , First Publish Date - 2020-06-08T22:26:53+05:30 IST

కరోనా మహమ్మారి అన్ని రంగాలతోపాటు సినీ రంగాన్ని కూడా కోలుకోలేని దెబ్బకొట్టింది

`ఆచార్య`.. బడ్జెట్ తగ్గిస్తున్నారా?

కరోనా మహమ్మారి అన్ని రంగాలతోపాటు సినీ రంగాన్ని కూడా కోలుకోలేని దెబ్బకొట్టింది. లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమ కొన్ని కోట్ల రూపాయలను కోల్పోయింది. ఇకపై పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. అందుకే సినిమా బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సినీపెద్దలు భావిస్తున్నారు. 


కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం `ఆచార్య`. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. లాక్‌డౌన్ ముగియగానే వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అయితే ముందు అనుకున్న బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్‌లో సినిమాను ముగించాలని చిరంజీవి స్పష్టం చేశారట. షూటింగ్‌ను తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పారట. ఆ మేరకు దర్శకుడు కొరటాల కథలో మార్పు చేర్పులు చేస్తున్నారట. `ఆచార్య` మాత్రమే కాకుండా మిగిలిన సినిమాలన్నీ ఇదే బాటలో పయనిస్తున్నాయట. 

Updated Date - 2020-06-08T22:26:53+05:30 IST