‘ఆడాళ్లు మీకు జోహార్లు’.. రష్మిక రెమ్యూనరేషన్‌పై చర్చలు

ABN , First Publish Date - 2020-10-27T03:12:40+05:30 IST

వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోన్న నటి రష్మిక మందన్న. 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' అంటూ రెండు భారీ విజయాలను ఈ సంవత్సరం తన

‘ఆడాళ్లు మీకు జోహార్లు’.. రష్మిక రెమ్యూనరేషన్‌పై చర్చలు

వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోన్న నటి రష్మిక మందన్న. 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' అంటూ రెండు భారీ విజయాలను ఈ సంవత్సరం తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ఇప్పుడు ఈ సంవత్సరం అతి పెద్ద హిట్‌ కొట్టిన అల్లు అర్జున్‌ సరసన 'పుష్ప'లో నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక తాజాగా రష్మిక నటించబోతోన్న మరో చిత్రం కూడా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. 'రెడ్‌' చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ టైటిల్‌తో.. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక నటించేందుకు భారీ రెమ్యూనరేషన్‌ తీసుకుందనే వార్తలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


కరోనా కష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నటీనటులందరూ తమ రెమ్యూనరేషన్లలలో కోత విధించుకోవాలనే వార్తలు వస్తున్న తరుణంలో రష్మిక ఈ చిత్రం కోసం తీసుకునే రెమ్యూనరేషన్‌ ఇప్పుడు వార్తలలో నిలుస్తుండటం విశేషం. ఈ చిత్రం కోసం రష్మిక రూ. ఒక కోటి 20 లక్షలను రెమ్యూనరేషన్‌గా అందుకోబోతోందని అంటున్నారు. మరి ఈ వార్తలలో నిజం ఎంత ఉందనేది తెలియదు కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం ఆమె రెమ్యూనరేషన్‌పై చర్చలు జరుగుతుండటం విశేషం. ఎస్.ఎల్.వి.సి బ్యానర్‌లో నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Updated Date - 2020-10-27T03:12:40+05:30 IST