‘ఆచార్య’ షూటింగ్ ఎప్ప‌టి నుండంటే?

ABN , First Publish Date - 2020-05-26T14:38:56+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ‘ఆచార్య‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. క‌రోనా ప్ర‌భావంతో సినిమా షూటింగ్‌ను ఆపేసిన సంగ‌తి తెలిసిందే.

‘ఆచార్య’ షూటింగ్ ఎప్ప‌టి నుండంటే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ‘ఆచార్య‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. క‌రోనా ప్ర‌భావంతో సినిమా షూటింగ్‌ను ఆపేసిన సంగ‌తి తెలిసిందే. రెండు నెల‌లు దాటిన త‌ర్వాత సినీ పెద్ద‌లు సినిమా షూటింగ్‌ల‌కు అనుమ‌తి కోసం ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. షూటింగ్‌ల‌కు సంబంధించిన విధి విధానాలు ఓకే అయిన త‌ర్వాత షూటింగ్స్ స్టార్ట్ అవుతాయి. జూన్ నుండి సినిమాల చిత్రీక‌ర‌ణ జ‌రిగే అవకాశాలున్నాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఆచార్య షూటింగ్ జూన్ 15 నుండి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్నఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌క్స‌లైట్ నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. 

Updated Date - 2020-05-26T14:38:56+05:30 IST