ప్ర‌భాస్, నాగ్ అశ్విన్ ఫిల్మ్: రెహమాన్‌కు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ABN , First Publish Date - 2020-08-05T02:45:28+05:30 IST

‘బాహుబ‌లి’ సినిమా ఎప్పుడైతే విడుద‌లైందో, అప్పుడే అసాధార‌ణ మాస్ ఇమేజ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా అవ‌త‌రించారు ప్ర‌భాస్‌. ఆయ‌న స్టార్‌డ‌మ్ కేవ‌లం ఇండియాకే

ప్ర‌భాస్, నాగ్ అశ్విన్ ఫిల్మ్: రెహమాన్‌కు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

‘బాహుబ‌లి’ సినిమా ఎప్పుడైతే విడుద‌లైందో, అప్పుడే అసాధార‌ణ మాస్ ఇమేజ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా అవ‌త‌రించారు ప్ర‌భాస్‌. ఆయ‌న స్టార్‌డ‌మ్ కేవ‌లం ఇండియాకే ప‌రిమితం కాకుండా అంత‌ర్జాతీయంగానూ విస్త‌రించింది. ప్ర‌భాస్ అంటే చార్మ్‌, మాచిస్మో, స్వాగ్‌, ట్రెమండ‌స్ యాక్టింగ్ టాలెంట్ క‌ల‌బోత‌. అటువంటి ప్రభాస్‌‌కు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చే చిత్రంగా నాగ్ అశ్విన్ ఓ చిత్రం చేయబోతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నార్త్ బ్యూటీ దీపికా పదుకొనేని హీరోయిన్‌గా ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మాములుగా లేవు. అంచనాలకు తగ్గట్లే ఖర్చు విషయంలో కూడా నిర్మాతలు వెనుకాడటం లేదు. 


భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం అన్ని భాషలలోని స్టార్ యాక్టర్స్‌నే సెలక్ట్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్‌ను సెలక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి రెహమాన్ వర్క్ చేసినందుకుగానూ.. అక్షరాలా రూ. 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోనున్నారట. ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం రెహమాన్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినవస్తున్నాయి. మరి ఈ వార్తపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ... కేవలం మ్యూజిక్‌కే రూ. 4 కోట్లు అంటే మాత్రం ఈ చిత్రం ఎలాంటి గ్రాండియర్ స్కేల్‌లో తెరకెక్కనుందో అనేది మరోసారి క్లారిటీ ఇచ్చినట్లుగా అంతా భావిస్తున్నారు.

Updated Date - 2020-08-05T02:45:28+05:30 IST