బిగ్‌బాస్ 4 ... 10 వారాలు..?
ABN , First Publish Date - 2020-08-08T13:14:19+05:30 IST
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌కు మంచి ఆదరణ ఉంది. దీంతో నిర్వాహకులు కరోనా సమయంలోనూ విధి విధానాలను పాటిస్తూ సీజన్ 4న ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌కు మంచి ఆదరణ ఉంది. దీంతో నిర్వాహకులు కరోనా సమయంలోనూ విధి విధానాలను పాటిస్తూ సీజన్ 4న ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరున బిగ్‌బాస్ 4 ప్రారంభమవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు బిగ్‌బాస్4 ఎన్నిరోజులుంటుంది? అనే దానిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు యాబై రోజులు ఉంటుందని అంటే కొందరు వంద రోజులు అని అంటున్నారు. తాజాగా బిగ్‌బాస్ 4ను పది వారాలు మాత్రమే ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి షోలో కౌగిలించుకోవడాలు, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వంటివి ఉండవు. టాస్కులు కూడా సురక్షిత దూరం పాటించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌ను క్వారంటైన్‌లో ఉంచారని సమాచారం. సీజన్ 3కి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున అక్కినేని, సీజన్ 4 కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.