‘భీష్మ’ రివ్యూ

ABN , First Publish Date - 2020-02-21T19:12:36+05:30 IST

బాక్సాఫీస్ ద‌గ్గర వ‌రుస‌గా మూడు చిత్రాలు నిరాశ‌ను మిగ‌ల్చడంతో హీరో నితిన్ హిట్ కొట్టేయాల‌నే ఆలోచ‌న‌ల‌తో త్వర‌త్వర‌గా సినిమాలు చేసేయ‌లేదు. గ్యాప్ తీసుకుని చేసిన సినిమా `భీష్మ‌`.

‘భీష్మ’ రివ్యూ

బ్యాన‌ర్‌:  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

నటీన‌టులు:  నితిన్‌, ర‌ష్మిక మంద‌న్న‌, జిస్సు సేన్ గుప్తా, అనంత్ నాగ్‌, వెన్నెల కిషోర్, సంప‌త్‌, స‌త్య‌, రాజీవ్ క‌న‌కాల‌, ర‌ఘుబాబు, బ్ర‌హ్మాజీ, న‌రేశ్ త‌దిత‌రులు

ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి

సినిమాటోగ్రఫీ:  సాయిశ్రీరామ్‌

సంగీతం:  మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌

నిర్మాత‌:  సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ద‌ర్శక‌త్వం:  వెంకీ కుడుముల‌


బాక్సాఫీస్ ద‌గ్గర వ‌రుస‌గా మూడు చిత్రాలు నిరాశ‌ను మిగ‌ల్చడంతో హీరో నితిన్ హిట్ కొట్టేయాల‌నే ఆలోచ‌న‌ల‌తో త్వర‌త్వర‌గా సినిమాలు చేసేయ‌లేదు. గ్యాప్ తీసుకుని చేసిన సినిమా `భీష్మ‌`. `ఛ‌లో` వంటి స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన భీష్మ‌ను ఎంట‌ర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో తెర‌కెక్కించాడ‌ని.. ఆర్గానిక్ వ్య‌వ‌సాయం అనే పాయింట్‌తో సినిమా తెర‌కెక్కింద‌ని సినిమా ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైంది. అస‌లు భీష్మ సినిమాతో నితిన్‌, వెంకీ ప్రేక్ష‌కుల‌ను ఎలా ఎంట‌ర్‌టైన్ చేశారు? హ‌్యాట్రిక్ ప్లాపులు త‌ర్వాత నితిన్ ఈ చిత్రంతో స‌క్సెస్‌ను అందుకున్నాడా? ర‌ష్మిక న‌ట‌న‌, గ్లామ‌ర్ సినిమాకు ఎంత మేర‌కు ప్ల‌స్ అయ్యింది?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.


కథ:

భీష్మ(నితిన్) డిగ్రీ తప్పిన కుర్రాడు. మీమ్స్ చేసుకుంటూ ఉంటాడు. అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉండదు. ఆ సమయంలో అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ దేవా(సంపత్) కూతురు ఛైత్ర(రష్మిక మందన్న)ని ప్రేమిస్తాడు. ఆమె భీష్మ ఆర్గానిక్ ఫార్మ్ కంపెనీలో పని చేస్తుంటుంది. ఆ కంపెనీ యజమాని పేరు కూడా భీష్మ(అనంత్ నాగ్). తన మంచితనంతో భీష్మ(నితిన్), ఛైత్ర మనసుని గెలుస్తాడు. కానీ దేవాకి భీష్మ తండ్రి అంటే పడదు. దాంతో వారి పెళ్లికి ఒప్పుకోడు. అప్పుడు భీష్మ తండ్రి(నరేష్).. తన కొడుకు భీష్మ ఆర్గానిక్ వ్యవసాయ కంపెనీకి కాబోయే చైర్మన్ అని చెబుతాడు. అదే సమయంలో భీష్మను నెల రోజుల పాటు భీష్మ ఆర్గానిక్ ఫార్మ్ కంపెనీకి సీఈఓగా అనౌన్స్ చేస్తారు. అసలు భీష్మ ఎవరు?  అతనికి, భీష్మ ఆర్గానిక్ వ్యవసాయ కంపెనీ ఉన్న సంబంధం ఏంటి? సీఈవోగా భీష్మ.. కంపెనీ బాధ్యతలు తీసుకుని ఏం చేస్తాడు? రసాయనాలు వాడుతూ వ్యవసాయం చేయాలంటూ ఓ ప్రొడక్ట్‌ను కనిపెట్టిన మరో కంపెనీ యజమాని రాజన్(జిస్సేన్ గుప్తా)ను భీష్మ ఎలా అడ్డుకుంటాడు?  తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే


సమీక్ష:

మూడు వరుస పరాజయాలు తర్వాత నితిన్ చేసిన భీష్మ సినిమాలో మన పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. నితిన్ లుక్, మేకింగ్ విషయంలో గత చిత్రాల స్టైల్లోనే కనపడ్డాడు. సందర్భానుసారం వచ్చే కామెడీ సన్నివేశాల్లో నితిన్ చక్కగా నటించాడు. ముఖ్యంగా మీమ్స్ డైలాగ్స్ చెప్పే సీన్స్, వెన్నెలకిషోర్ కామెడీ..రఘుబాబు కామెడీ ఆకట్టుకుంటుంది. రష్మికతో లవ్ సీన్స్‌లోనూ నితిన్ నటన ఆకట్టుకుంటుంది. ఇక రష్మిక విషయానికి వస్తే.. తను పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. ముఖ్యంగా వాట్టే బేబీ పాటలో.. తన నటన ఆకట్టుకుంటుంది. సంపత్, నరేశ్, బ్రహ్మాజీ తదితరులు వారి పాత్రల మేరకు చక్కగా నటించారు. సంపత్ క్యారెక్టర్‌ను చూపించినంత సీరియస్‌గా క్యారీ చేయకుండా కమర్షియల్ సినిమాలో కామెడీ చేసేసినట్టు చేసేశారు. ఇక సినిమాలో కమర్షియల్ కామెడీని పండించడంలో వెన్నెల కిషోర్ తనదైన పాత్రను పోషించాడు. వాస్తవానికి దూరంగా ఉండే ఈ పాత్రలో వెన్నెల కిషోర్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

వెంకీ కుడుముల ఛలో తరహాలో కమర్షియల్ పంథాలో సినిమాను ఆసాంతం ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కామెడీ సన్నివేశాలను, అందుకు తగిన విధంగా నితిన్ పాత్రను, దానికి సపోర్టింగ్‌గా ప్రేక్షకులను నవ్వించేలా వెన్నెలకిషోర్ పాత్రను క్రియేట్ చేయడం ప్లస్ అయ్యింది. కథ పరంగా చూస్తే రొటీన్ కమర్షియల్. గొప్ప కథేం కాదు. సాగర్ మహతి సంగీతంలో వాట్టే బేబీ ... సాంగ్ అందులో నితిన్, రష్మిక డాన్స్ చాలా బావున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బావుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఓ పెద్ద కంపెనీ సీఈఓను అలా కూడా నిర్ణయిస్తారా? అనే సందేహం కచ్చితంగా కలుగుతుంది. క్షేత్రీయ వ్యవసాయం అనే పాయింట్ తప్ప కథలో వెతికినా ఏమీ కనపడదు. కమర్షియల్ పంథాలో సినిమాను నడిపించారు.


చివరగా.. అదృష్టవంతుడితో పోరాడలేమని ఈ సినిమాలో ఓ సందర్భంలో డైలాగ్ ఉంటుంది. .. ఆ కోవలో అన్నీ కలిసొస్తే ఈ వారం బాక్సాఫీస్ వద్ద ‘భీష్మ’ కమర్షియల్ విన్నర్ అవుతాడు


రేటింగ్: 2.75/5


Updated Date - 2020-02-21T19:12:36+05:30 IST