మీ సంఘీభావం హత్తుకుంది

ABN , First Publish Date - 2020-04-20T09:24:45+05:30 IST

స్విట్జర్లాండ్‌లోని ప్రఖ్యాత ‘మేటర్‌హార్న్‌’ పర్వతాన్ని త్రివర్ణ పతాక కాంతుల్లో చూస్తామని ఎప్పుడూ అనుకోలేదని అల్లు అర్జున్‌ అన్నారు. కరోనా వైరస్‌ నివారణకు...

మీ సంఘీభావం హత్తుకుంది

స్విట్జర్లాండ్‌లోని ప్రఖ్యాత ‘మేటర్‌హార్న్‌’ పర్వతాన్ని త్రివర్ణ పతాక కాంతుల్లో చూస్తామని ఎప్పుడూ అనుకోలేదని అల్లు అర్జున్‌ అన్నారు. కరోనా వైరస్‌ నివారణకు భారత ప్రభుత్వం చేస్తున్న అలుపెరగని పోరాటానికి స్విట్జర్లాండ్‌ సంఘీభావం ప్రకటించిన సంగతి విధితమే! ఈ సందర్భంగా స్విస్‌ ఆల్ప్స్‌లోని ‘మేటర్‌హార్న్‌’ పర్వతంపై భారత జాతీయ జెండా కాంతులను కొద్దిసేపు ప్రదర్శించిన నేపథ్యంలో అల్లుఅర్జున్‌.. భారత్‌కు సంఘీభావం ప్రకటించిన స్విట్జర్లాండ్‌కు ధన్యవాదాలు తెలిపారు. త్రివర్ణ పతాక కాంతుల్లో మెరుస్తున్న మేటర్‌హార్న్‌ పర్వతానికి సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసి ‘‘థ్యాంక్యూ స్విట్జర్లాండ్‌. కరోనా కట్టడి కోసం భారతదేశం చేస్తున్న పోరుకు సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు. మీరు సంఘీభావం ప్రకటించిన తీరు హృదయాలను హత్తుకుంది’’ అని బన్నీ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-04-20T09:24:45+05:30 IST