ప్రభాస్‌.. ‘ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా’

ABN , First Publish Date - 2020-10-23T03:33:25+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు నేడు దశదిశలా మారుమోగిపోతోంది. ఇంటర్నేషనల్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఈ సందర్భంగా ప్రభాస్‌కు

ప్రభాస్‌.. ‘ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా’

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు నేడు దశదిశలా మారుమోగిపోతోంది. ఇంటర్నేషనల్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఈ సందర్భంగా ప్రభాస్‌కు విషెస్ చెబుతూ, ఆయన బాణీని గుర్తు చేసుకుందాం. ప్రభాస్ పేరు వింటే చాలు అభిమానుల మదిలో ఆనందం అంబరమంటుతుంది... 'బాహుబలి'గా ప్రభాస్ ప్రభ దశదిశలా ప్రసరిస్తోంది. దీంతో తెలుగునేలపైనే కాదు, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ, అంతర్జాతీయంగా ఉన్న తెలుగువారందరూ ప్రభాస్ తాజా చిత్రాల కోసం కళ్ళు ఇంతలు చేసుకొని ఎదురుచూస్తున్నారు. 'రాధే శ్యామ్'లో బుట్టబొమ్మ పూజా హెగ్డేతో కలసి అలరించడానికి సిద్ధమవుతున్నాడు ప్రభాస్. ఇందులో ప్రభాస్ కేరెక్టర్ విక్రమాదిత్య అట. దీనిని బట్టే ఆ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందనీ తెలుస్తోంది. ఇక 'ఆదిపురుష్'లో శ్రీరామ పాత్రలోనూ కనిపించబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు కాకుండా టైమ్ మిషన్ తో ప్రయాణం చేస్తూ వైజయంతీ మూవీస్‌లో వినోదం పంచబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాలు ఎలా ఉంటాయో? ఎలా అలరిస్తాయో అన్న చర్చ అభిమానుల్లో అప్పుడే మొదలైంది.


ప్రభాస్ పేరే తమ సినిమాలకు ఓ ఎస్సెట్ అని భావిస్తున్నారు నిర్మాతలు. అందుకే ప్రభాస్ కాల్ షీట్స్ దొరికితే చాలు అనుకుంటున్నారు. కేవలం తెలుగు నిర్మాతలే కాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ సైతం ప్రభాస్‌తో సినిమాలు తీయడానికి తహతహలాడుతున్నారంటే ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్‌తో రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' తెరకెక్కిస్తున్నదీ బాలీవుడ్ జనమే. ఇక ఇంటర్నేషనల్ గానూ ప్రభాస్‌కు ఎనలేని క్రేజ్ సొంతమైంది. దాంతో 'ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా'గానూ ప్రభాస్ జేజేలు అందుకుంటున్నాడు.


ఏ స్థాయిలో స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నా, ప్రభాస్ ఎప్పటిలాగే సన్నిహితులను 'డార్లింగ్' అంటూ అభిమానంగా పిలుస్తూ సాగుతున్నాడు. ఇంతటి స్టార్ డమ్ ప్రభాస్ సొంతమయినా, అతను ఎప్పటిలాగే ఉన్నాడని, మార్పు ఇంతయినా లేదని హితులు, సన్నిహితులు చెబుతున్నారు. ఇక అభిమానులు తమ 'డార్లింగ్ హీరో' రాబోయే అన్ని చిత్రాలతోనూ జనాన్ని విశేషంగా అలరించాలని ఆశిస్తున్నారు. మరికొందరు వీరాభిమానులయితే ఈ బర్త్ డే తరువాత తమ కథానాయకుడు ఓ ఇంటివాడు కావాలనీ ఆకాంక్షిస్తున్నారు. ప్రభాస్ అభిమానుల అభిలాషను ఈ సారి ఆయన నెరవేరుస్తాడని ఆశిద్దాం.Updated Date - 2020-10-23T03:33:25+05:30 IST

Read more