ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీస్‌లో మాస్క్‌తో దర్శనమిచ్చిన ప్రభాస్‌

ABN , First Publish Date - 2020-08-07T01:24:01+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శనం కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారంటే.. ఆయన తన కారు రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆర్టీఏ ఆఫీస్‌కు వెళితే.. కరోనాని

ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీస్‌లో మాస్క్‌తో దర్శనమిచ్చిన ప్రభాస్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శనం కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారంటే.. ఆయన తన కారు రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆర్టీఏ ఆఫీస్‌కు వెళితే.. కరోనాని సైతం లెక్కచేయకుండా ఆయనతో ఫొటోలు దిగేంతగా. అవును.. ప్రభాస్ బుధవారం తన కొత్త కారు రిజిస్ట్రేషన్ నిమిత్తం ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీస్‌‌కు వెళ్లారు. చాలా గ్యాప్ తర్వాత పబ్లిక్‌లో మాస్క్‌తో దర్శనమిచ్చిన ప్రభాస్‌ని అక్కడి సిబ్బందితో పాటు అభిమానులు కూడా సెల్ఫీలతో బంధించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అసలైతే ప్రభాస్ దర్శనం కోసం ఆయన అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ వేసేందుకు ఇటీవల ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ప్రభాస్ చేస్తున్న మరో మూవీ ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ అయితే వస్తున్నాయి కానీ, ప్రభాస్ మాత్రం ఎక్కడా దర్శనం ఇవ్వడం లేదు. ఇక కొత్తకారు రిజిస్ట్రేషన్ నిమిత్తం.. ఆర్టీఏ ఆఫీస్‌కు మాస్క్ ధరించి వచ్చిన ప్రభాస్‌ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో.. వాటిని వైరల్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.Updated Date - 2020-08-07T01:24:01+05:30 IST