‘హెచ్‌23’ మూవీ ట్రైలర్‌ వదిలిన యంగ్‌ హీరో

ABN , First Publish Date - 2020-12-26T00:37:37+05:30 IST

వి. కుమారస్వామి, కవిత, శ్రీజ హీరోహీరోయిన్లుగా ఇమంది శ్రీను (బీటెక్ బాబులు) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హార‌ర్ కామెడి చిత్రం 'హెచ్‌23'. మాస్ట‌ర్ జోషిత్ స‌మ‌ర్ప‌ణ‌లో

‘హెచ్‌23’ మూవీ ట్రైలర్‌ వదిలిన యంగ్‌ హీరో

వి. కుమారస్వామి, కవిత, శ్రీజ హీరోహీరోయిన్లుగా ఇమంది శ్రీను (బీటెక్ బాబులు) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హార‌ర్ కామెడి చిత్రం 'హెచ్‌23'. మాస్ట‌ర్ జోషిత్ స‌మ‌ర్ప‌ణ‌లో వైవీకేఎస్ క్రియేషన్స్ పతాకంపై న‌వీన కె, సంధ్య వి వై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తరుణ్ రాణా ప్రతాప్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ ఆవిష్క‌రించారు. ప్ర‌ముఖ నిర్మాత యమ్ వి వి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని 'హెచ్‌23' చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను వైజాగ్ నోవాటెల్ హోట‌ల్‌లో యంగ్ హీరో సందీప్ కిష‌న్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 


ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌క నిర్మాతలు మాట్లాడుతూ.. '' మా 'హెచ్‌23' మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన కోన వెంక‌ట్‌గారికి, ట్రైల‌ర్ విడుద‌ల చేసిన సందీప్ కిష‌న్ గారికి, అలాగే యమ్ వి వి సత్యనారాయణ గారికి హృద‌య‌పూర్వ‌క ధన్య‌వాదాలు. 'ప‌గ‌బ‌‌ట్టే ఆత్మ‌కంటే... ప్రేమించే ప్రేతాత్మ ప్ర‌మాద‌క‌రం' అనే ఒక డిఫ‌రెంట్ క‌థాంశంతో హార‌ర్ కామెడిగా ఈ మూవీ రూపొందుతోంది. ఆర్టిస్టులు టెక్నీషియ‌న్స్ కొత్త‌వారైనా పూర్తి స‌హ‌కారం అందించారు. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జ‌న‌వ‌రిలో థియేట‌ర్‌ల‌లో సినిమాని విడుద‌ల చేస్తాం. ఈ చిత్రం త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది" అన్నారు.Updated Date - 2020-12-26T00:37:37+05:30 IST