ఒక్కటైన నిఖిల్, పల్లవి!

ABN , First Publish Date - 2020-05-14T14:36:37+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. తను ప్రేమించిన డా. పల్లవి వర్మను

ఒక్కటైన నిఖిల్, పల్లవి!

యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. తను ప్రేమించిన డా. పల్లవి వర్మను ఈ రోజు (గురువారం) ఉదయం 6:31 గంటలకు పెళ్లి చేసుకున్నాడు. తక్కువ మంది అతిథుల సమక్షంలో శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పెళ్లి వేడుక జరిగింది. 


మొదట ఈ పెళ్లికి ఏప్రిల్ 16న ముహూర్తం పెట్టారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా పెళ్లిని వాయిదా వేయక తప్పలేదు. పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఘనంగా పెళ్లి చేసుకోవాలని నిఖిల్ భావించాడు. అయితే లాక్‌డౌన్ త‌రువాత మూఢం రావ‌టం, ముహుర్తాలు లేక‌పోవ‌టం వ‌ల్ల గురువారం ఉదయం పెళ్లి చేసెయ్యాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. దీంతో నిరాడంబంరంగా ఈ పెళ్లి వేడుక జరిగిపోయింది. 

Updated Date - 2020-05-14T14:36:37+05:30 IST