వివాదంలో ‘కాక్‌టెయిల్‌’ పోస్టర్‌

ABN , First Publish Date - 2020-02-04T15:57:39+05:30 IST

ఇటీవల కాలంలో హిందూ దేవతల్ని కించపరిచేలా సినిమాల్లో సన్నివేశాలుంటున్నాయనే ఆరోపణలు వస్తున్న తరుణంలో

వివాదంలో ‘కాక్‌టెయిల్‌’ పోస్టర్‌

ఇటీవల కాలంలో హిందూ దేవతల్ని కించపరిచేలా సినిమాల్లో సన్నివేశాలుంటున్నాయనే ఆరోపణలు వస్తున్న తరుణంలో.. తమిళంలో సోమవారం విడుదల చేసిన ‘కాక్‌టెయిల్‌’ సినిమా పోస్టర్‌ ఈ వివాదాన్ని మరింత రగిల్చింది. విజయ్‌ మురుగన్‌ దర్శకత్వంలో యోగిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాక్‌టెయిల్‌’. టైటిల్‌ మద్యానికి సంబంధించిన పదం. అయితే పోస్టర్‌లో తమిళంలో ఆరాధించే దైవం మురుగన్‌ వేషధారణలో ఉన్న యోగిబాబు స్టిల్‌ చూసి టైటిల్‌కి, ఈ పోస్టర్‌కి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్న తలెత్తింది. ‘కాక్‌టెయిల్‌’ టైటిల్‌గా ఉన్న సినిమాకి ఇలాంటి పోస్టర్‌ విడుదల చేయడం ఏమిటని పలువురు బహిరంగంగానే విమర్శిస్తునారు.


అయితే ఎవరి మనోభావాల్ని కించపరిచేలా ఈ సినిమా కథగానీ, పోస్టరుగానీ రూపొందించ లేదని, తాను కూడా మురుగన్‌ భక్తుడినేనని, తన పేరులోనూ మురుగన్‌ ఉందని దర్శకుడు విజయ్‌ మురుగన్‌ వివరణ ఇచ్చారు. సినిమాలో యోగిబాబు కూడా మురుగన్‌ భక్తుడిగానే నటిస్తున్నారని, సినిమా చూశాక అందరూ హర్షిస్తారని పేర్కొన్నారు.

Updated Date - 2020-02-04T15:57:39+05:30 IST