నిర్మాత యలమంచిలి రవిశంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్
ABN , First Publish Date - 2020-07-21T20:41:15+05:30 IST
నిర్మాత యలమంచిలి రవిశంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఛాలెంజ్‌ను స్వీకరించి సంతోష్ కుమార్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతలకు మంచి స్పందన వస్తుంది. సినీ సెలబ్రిటీలు స్వచ్చందంగా పాల్గొని ఇతరులను నామినేట్ చేస్తున్నారు. తాజాగా నిర్మాత యలమంచిలి రవిశంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఛాలెంజ్‌ను స్వీకరించి సంతోష్ కుమార్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మొయినాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో రవిశంకర్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ ‘‘రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో బాగంగా మన అందరి చేత మొక్కలు నాటించడం చాలా సంతోషకరం. దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటాలి. ఈ కార్యక్రమంల భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యాన్ని ఆకుపచ్చ భారతదేశాన్ని అందించడం కోసం తోడ్పడుతుంది’’ అని తెలిపారు. డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్ కృతిశెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు యలమంచిలి రవిశంకర్.