రావి కొండలరావు రచనలు!
ABN , First Publish Date - 2020-07-29T09:54:47+05:30 IST
కథలు, నాటికలు, నాటకాలే కాకుండా సినిమాలకు సంబంధించి కొన్ని పుస్తకాలు కూడా రాశారు రావి కొండలరావు. అక్కినేని నట జీవితాన్ని విశ్లేసిస్తూ రాసిన ‘మనసులోని మాట’, నాగయ్య ‘స్వీయ చరిత్ర’ సహా ‘మాయా బజార్’, ‘మల్లీశ్వరి’, ‘హ్యూమరథం’ ‘రావి కొండలరావు కథలు’,...

కథలు, నాటికలు, నాటకాలే కాకుండా సినిమాలకు సంబంధించి కొన్ని పుస్తకాలు కూడా రాశారు రావి కొండలరావు. అక్కినేని నట జీవితాన్ని విశ్లేసిస్తూ రాసిన ‘మనసులోని మాట’, నాగయ్య ‘స్వీయ చరిత్ర’ సహా ‘మాయా బజార్’, ‘మల్లీశ్వరి’, ‘హ్యూమరథం’ ‘రావి కొండలరావు కథలు’, ‘వాహిని’ లాంటి రచనలు చేశారు. తన ఆత్మకథను ‘నాగావళి నుంచి మంజీరా వరకు’ పేరిట తీసుకొచ్చారు. అలాగే ‘బ్లాక్ అండ్ వైట్’ పేరుతో రావి కొండలరావు సినీ సంకలనం రాశారు. అలనాటి సినిమా విశేషాలను ఆ సంకలనంలో అందించేవారు. తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా 2004లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారానికి ఎంపికైంది.
