రాకెట్‌ స్పీడ్‌తో...

ABN , First Publish Date - 2020-11-13T10:51:33+05:30 IST

రాకెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు తాప్సీ పన్ను. క్రీడానేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘రష్మీరాకెట్‌’ చిత్రంలో ఆమె మారథాన్‌ రన్నర్‌గా...

రాకెట్‌ స్పీడ్‌తో...

రాకెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు తాప్సీ పన్ను. క్రీడానేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘రష్మీరాకెట్‌’ చిత్రంలో ఆమె మారథాన్‌ రన్నర్‌గా కనిపిస్తున్నారు. ఇటీవల ‘హసీన్‌ దిల్‌రుబా’ చిత్రం షూటింగ్‌ను ముగించిన తాప్సీ ప్రస్తుతం ‘రష్మీరాకెట్‌’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. చిత్రీకరణకు సంబంఽధించిన కొన్ని ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.  అథ్లెటిక్‌ దుస్తుల్లో చేతులు నేలపై ఆన్చి, కొంచెం ఒంగి మోకాళ్లపై ట్రాక్‌మీద పరిగెత్తడానికి తాప్సీ సిద్ధంగా ఉన్నారు. ‘విల్లు మరియు బాణం’ అనే వ్యాఖ్యను తాప్సీ జోడించారు. ఇందులో గుజరాతీ యువతిగా తాప్సీ నటిస్తున్నారు.


Updated Date - 2020-11-13T10:51:33+05:30 IST