ప్రభాస్‌తో ‘కె.జి.యఫ్‌’ నిర్మాత భారీ చిత్రం

ABN , First Publish Date - 2020-12-01T06:46:15+05:30 IST

‘కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 1’తో హీరో యశ్‌ మాత్రమే కాదు... దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, ఆ చిత్రనిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా ప్రేక్షకులు...

ప్రభాస్‌తో ‘కె.జి.యఫ్‌’ నిర్మాత భారీ చిత్రం

‘కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 1’తో హీరో యశ్‌ మాత్రమే కాదు... దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, ఆ చిత్రనిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా ప్రేక్షకులు, పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. కన్నడలో భారీ బడ్జెట్‌ చిత్రాలు తీయగల దర్శక, నిర్మాతలు ఉన్నారని చాటిచెప్పారు. ‘కె.జి.యఫ్‌’ విడుదలైన తర్వాత ఆ చిత్ర దర్శక, నిర్మాతలతో పాన్‌ ఇండియా స్థాయిలో ప్రభాస్‌ ఓ భారీ చిత్రం చేయనున్నారని వార్తలొచ్చాయి. అయితే, ఇప్పటివరకూ ప్రకటన రాలేదు. బుధవారం ఆ చిత్రం విశేషాలను ప్రకటించనున్నారు. ఈ నెల 2వ తేదీన మధ్యాహ్నం 2.09 గంటలకు హోంబలే ఫిల్మ్స్‌ సంస్థలో ‘కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 2’ తర్వాత చేయబోయే భారీ పాన్‌ ఇండియా చిత్రం వివరాలను వెల్లడిస్తామని నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ప్రకటించారు. అది ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో నిర్మించబోయే సినిమా అని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారీ బడ్జెట్‌, ఉన్నత సాంకేతిక విలువలతో చిత్రాలు నిర్మించి దక్షిణాది చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని విజయ్‌ కిరగందూర్‌ తెలిపారు.

Updated Date - 2020-12-01T06:46:15+05:30 IST

Read more