ప్యాషన్‌తోనే ఎక్కువ అలరించగలను

ABN , First Publish Date - 2020-06-29T09:48:08+05:30 IST

బాలీవుడ్‌ ఖాన్‌ త్రయంలో షారుఖ్‌ ఖాన్‌ ఒకరు. ఆయన నటుడిగా కెరీర్‌ ప్రారంభించి 28 వసంతాలు పూర్తయింది. షారుఖ్‌ నటించిన తొలి చిత్రం ‘దివానా’ విడుదలై శనివారానికి 28 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తనని ...

ప్యాషన్‌తోనే ఎక్కువ అలరించగలను

బాలీవుడ్‌ ఖాన్‌ త్రయంలో షారుఖ్‌ ఖాన్‌ ఒకరు. ఆయన నటుడిగా కెరీర్‌ ప్రారంభించి 28 వసంతాలు పూర్తయింది. షారుఖ్‌ నటించిన తొలి చిత్రం ‘దివానా’ విడుదలై శనివారానికి 28 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తనని అభిమానించిన ప్రేక్షకులకు ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘దివానా’ చిత్రం నుంచి ‘జీరో’ సినిమా వరకూ ఎన్నో మధురానుభవాలు ఉన్నాయి. ప్రతి సినిమా ఒక్కో విషయాన్ని నేర్పింది. నా ప్యాషన్‌ జీవిత    లక్ష్యంగా మారింది. ఆ తర్వాత అదే వృత్తిగా మారింది. ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు తెలీదు. నా వృత్తి నైపుణ్యంతో కన్నా ప్యాషన్‌తోనే ఎక్కువ అలరించగలనని నమ్ముతున్నా. ఇంతకాలం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని షారుఖ్‌ ఖాన్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. 

Updated Date - 2020-06-29T09:48:08+05:30 IST