పాత కెమెరా ట్రిక్స్‌తో...

ABN , First Publish Date - 2020-05-11T07:58:52+05:30 IST

నితిన్‌ ప్రసన్న త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘ఎ’. యుగంధర్‌ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతోంది...

పాత కెమెరా ట్రిక్స్‌తో...

నితిన్‌ ప్రసన్న త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘ఎ’. యుగంధర్‌ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతోంది. ఇటీవల ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘థ్రిల్లర్‌ చిత్రమిది. సింగీతం శ్రీనివాసరావుగారి స్ఫూర్తితో సాధ్యమైనంతవరకూ వీఎఫ్‌ఎక్స్‌కి వెళ్లకుండా, పాత కెమెరా ట్రిక్స్‌ ఉపయోగించి బడ్జెట్‌ పరిధిలో నితన్‌ త్రిపాత్రాభినయ సన్నివేశాలు తెరకెక్కించాం. పాత్రల మధ్య వ్యత్యాసం కోసం అతను బాగా కృషి చేశాడు. టైటిల్‌ పోస్టర్‌, లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. 


Updated Date - 2020-05-11T07:58:52+05:30 IST