కూతుళ్లతో పొలం దున్నిస్తున్న రైతు.. ట్రాక్టర్ పంపుతానన్న సోనూసూద్

ABN , First Publish Date - 2020-07-27T01:20:32+05:30 IST

కరోనా కారణంగా చాలామంది ప్రజలు ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నారు.

కూతుళ్లతో పొలం దున్నిస్తున్న రైతు.. ట్రాక్టర్ పంపుతానన్న సోనూసూద్

ముంబై: కరోనా కారణంగా చాలామంది ప్రజలు ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నారు. లాక్‌డౌన్ కష్టాల నుంచి ఇంకా వాళ్లంతా కోలుకోలేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రైతు.. కనీసం ఎద్దులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దీంతో పొలం దున్నడానికి ఏదారీ లేకపోవడంతో తన కుమార్తెల చేత నాగలి లాగించాడు. కుమార్తెలు నాగలి లాగుతుంటే పొలం దున్నుతున్న ఈ రైతు వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. దీన్ని చూసిన యాక్టర్ సోనూసూద్ చలించిపోయాడు. ‘రేపు మీకు రెండు ఎద్దులు ఉంటాయి. కాదు ఈ కుటుంబానికి ఓ ట్రాక్టర్ ఉండాలి. సాయంత్రానికల్లా మీకు ఓ ట్రాక్టర్ పంపిస్తాను’ అంటూ ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు సోనూసూద్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.Updated Date - 2020-07-27T01:20:32+05:30 IST

Read more