మీ కొడుకులకు సంస్కారం నేర్పొచ్చుగా?: బీజేపీ ఎమ్మెల్యేపై సినీ నటి ఫైర్

ABN , First Publish Date - 2020-10-05T23:44:36+05:30 IST

మీ కొడుకులకు సంస్కారం నేర్పొచ్చుగా?: బీజేపీ ఎమ్మెల్యేపై సినీ నటి ఫైర్

మీ కొడుకులకు సంస్కారం నేర్పొచ్చుగా?: బీజేపీ ఎమ్మెల్యేపై సినీ నటి ఫైర్

ముంబై: అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే కూతుళ్లకు సంస్కారం నేర్పాలన్న బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి కృతి సనన్ మండిపడ్డారు. ‘‘మీ కుమారులకు సంస్కారం నేర్పలేరా?’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. హథ్రస్ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అత్యాచారాలపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అధికార పార్టీ బీజేపీపై భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నేరాన్ని సమర్ధిస్తున్నట్లుగా మహిళలే సంస్కారం నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది.


ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి కృతి సనన్ స్పందించారు. ‘‘అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే కూతుళ్లకు సంస్కారం నేర్పించాలా? చాలా గందరగోళంగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు వినపడుతుందో లేదో? ఇలాంటి ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూతుళ్లకే సంస్కారం నేర్పించాలా? మీ కొడుకులకు సంస్కారం నేర్పించలేరా?’’ అని కృతి సనన్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-10-05T23:44:36+05:30 IST

Read more