‘మసూద’ ఎవరు?

ABN , First Publish Date - 2020-12-26T08:50:37+05:30 IST

తిరువీర్‌, కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా... సంగీత ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మసూద’. ‘‘తన పదిహేడేళ్ల కుమార్తె అనూహ్యంగా...

‘మసూద’ ఎవరు?

తిరువీర్‌, కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా... సంగీత ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మసూద’. ‘‘తన పదిహేడేళ్ల కుమార్తె అనూహ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఆందోళన చెందుతుంది ఓ ఒంటరి తల్లి. అతి భయస్తుడైన పక్కింటి యువకుడి సహాయంతో కుమార్తెను ఆమె ఎలా కాపాడుకుందనేది సినిమాలో ప్రధానాంశం. మసూద ఎవరనేది ఆసక్తికరం’’ అని చెప్పారు దర్శకుడు సాయికిరణ్‌. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, నిర్మాత: రాహుల్‌ యాదవ్‌ నక్కా.

Updated Date - 2020-12-26T08:50:37+05:30 IST