పాక్ సినీనటితో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ప్రేమాయణం

ABN , First Publish Date - 2020-08-25T14:11:33+05:30 IST

ప్రముఖ పాకిస్థాన్ దేశానికి చెందిన సినీనటి మెహ్విష్ హయత్‌తో అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు సంబంధాలున్నాయా?...

పాక్ సినీనటితో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ప్రేమాయణం

కరాచీ (పాకిస్థాన్): ప్రముఖ పాకిస్థాన్ దేశానికి చెందిన సినీనటి మెహ్విష్ హయత్‌తో అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు సంబంధాలున్నాయా? అంటే అవునంటున్నాయి కొన్ని వర్గాలు. భారతదేశం నుంచి పారిపోయిన దావూద్ పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలోని ఓ బంగ్లాలో నివాసముంటున్నారు. దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ చిత్ర పరిశ్రమతోపాటు పాక్ సినీనటి 37 ఏళ్ల మెహ్విష్ హయత్ తో సంబంధాలున్నాయని, ఆయన వారితో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నాడని తాజాగా వెల్లడైంది.


గతంలో ముంబై నగరంలో దావూద్ నివాసమున్నపుడు కూడా బాలీవుడ్ సినీనటులతో సన్నిహిత సంబంధాలుండేవి.అప్పట్లో దావూద్ పలు బాలీవుడ్ సినిమాల్లోనూ పెట్టుబడులు పెట్టాడు. పలువురు బాలీవుడ్ నటులు దావూద్ ఇంట్లో జరిగిన విందులకు సైతం హాజరయ్యారు. ముంబై నుంచి కరాచీకి పారిపోయాక డాన్ దావూద్ కు చిత్ర పరిశ్రమపై ఆసక్తి తగ్గలేదని తెలిసింది. దావూద్‌తో సంబంధం వల్లనే పాక్ నటి మెహ్విష్‌కు 2019లో పాక్ పౌర పురస్కారమైన ‘తమ్గా  ఇంతియాజ్’ లభించిందని సమాచారం.కొన్నేళ్ల క్రితం వరకు అంతగా తెలియని సినీనటి మెహ్విష్ హయత్‌కు పాక్ పురస్కారం లభించడంతో పాక్ చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది.


కరాచీకి చెందిన దావూద్‌తో ఉన్న సంబంధం కారణంగానే పాక్ నటి మెహ్విష్ కు పురస్కారం లభించిందని పలు వెబ్ సైట్లలో వార్తలు వెలువడ్డాయి. ఐటం గర్ల్ గా తన సినీ కెరీర్ ప్రారంభించిన మెహ్విష్ దావూద్ ఇబ్రహీం దృష్టిని ఆకర్షించిందని, దావూద్ తో సంబంధాల వల్లనే ఆమెకు పలు పెద్ద సినిమాల్లో అవకాశాలు లభించాయని సమాచారం. 

Updated Date - 2020-08-25T14:11:33+05:30 IST