ఆ ఇద్దరిలో ఎవరు?

ABN , First Publish Date - 2020-06-12T06:34:04+05:30 IST

మహేశ్‌ హీరోగా పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో మహేశ్‌ సరసన కథానాయికగా ఎవర్ని ఎంపిక చేద్దామనే చర్చలు జరుగుతున్నాయి...

ఆ ఇద్దరిలో ఎవరు?

మహేశ్‌ హీరోగా పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో మహేశ్‌ సరసన కథానాయికగా ఎవర్ని ఎంపిక చేద్దామనే చర్చలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు ‘భరత్‌ అనే నేను’లో మహేశ్‌ సరసన నటించిన కియారా అడ్వాణీ కాగా, మరో నాయిక కీర్తి సురేశ్‌. అయితే ఇంతకుముందే కియారా పేరు వినిపించినా ఇప్పుడు కీర్తి సురేష్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఫైనల్‌గా మహేశ్‌ సరసన ఎవరు నటిస్తారో చూడాలి. అన్నీ ఓకే అయితే సెప్టెంబర్‌ నెలలో ఈ చిత్రం పట్టాలెక్కవచ్చు.


Updated Date - 2020-06-12T06:34:04+05:30 IST