మోసగాళ్లెవరు?

ABN , First Publish Date - 2020-10-01T06:35:42+05:30 IST

విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. భారతదేశంలో మొదలై, అగ్ర రాజ్యం అమెరికాను వణికించి...

మోసగాళ్లెవరు?

విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. భారతదేశంలో మొదలై, అగ్ర రాజ్యం అమెరికాను వణికించి... అతి పెద్ద ఐటీ కుంభకోణంగా చరిత్రపుటల్లోకి ఎక్కిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ కుంభకోణం ఏ స్థాయిలో ఉంటుందనేది అక్టోబర్‌ 3న అల్లు అర్జున్‌ బయటపెట్టనున్నారు. ఆయన ఈ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్‌ థీమ్‌ మ్యూజిక్‌ను వెంకటేశ్‌ విడుదల చేశారు. విష్ణు సోదరిగా కాజల్‌ అగర్వాల్‌, కీలక పాత్రలో సునీల్‌ శెట్టి, ఇంకా నవదీప్‌, నవీన్‌ చంద్ర, రూహీ సింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి విష్ణు మంచు నిర్మాత. శ్యామ్‌ సీఎస్‌ సంగీత దర్శకుడు.


Updated Date - 2020-10-01T06:35:42+05:30 IST