రియా చక్రవర్తి ఎక్కడ..?

ABN , First Publish Date - 2020-08-02T00:25:40+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బీహార్ పోలీసులు విచారణను...

రియా చక్రవర్తి ఎక్కడ..?

పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బీహార్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు సుశాంత్ ఆత్మహత్యలో రియా చక్రవర్తి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విచారణపై బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే మాట్లాడుతూ.. విచారణ ప్రాథమిక దశలో ఉందని, కోర్టులో కూడా ఈ కేసు విచారణ కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికి రియా చక్రవర్తి ఎక్కడ ఉందో గుర్తించలేకపోయామని.. అయితే ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మురం చేశామని చెప్పారు.


ఇదిలా ఉంటే.. ఈ కేసు విచారణలో భాగంగా బీహార్ పోలీసు బృందం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ కేసులో ‘రియా చక్రవర్తిని ప్రశ్నించారా’ అని మీడియా ప్రతినిధులు ఆటోలో వెళుతున్న బీహార్ పోలీసులను అడగ్గా.. ప్రస్తుతానికి ఆమెను ప్రశ్నించాల్సిన అవసరం లేదని, ఆమెపై తమ నిఘా ఉందని చెప్పారు.

Updated Date - 2020-08-02T00:25:40+05:30 IST