కొంటెగా కామెంట్ చేసిన నెటిజెన్‌కు సోనూ సూద్ అద్భుతమైన రిప్లై

ABN , First Publish Date - 2020-05-25T23:19:06+05:30 IST

దీనికి సోనూ సూద్ ‘‘భాయ్, నువ్వు షాపు నుంచి తిరిగి వచ్చేందుకు నేను నీకు సహాయం చేయగలను. నీకు అవసరం అయితే నాతో చెప్పు’’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇంకే ముంది, సోనూ రిప్లైకు సిగ్గుపడ్డ ఆ నెటిజెన్లు తిరిగి కామెంట్ చేయలేదు

కొంటెగా కామెంట్ చేసిన నెటిజెన్‌కు సోనూ సూద్ అద్భుతమైన రిప్లై

ముంబై: లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రదేశాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులను సొంతూళ్లకు పంపిస్తున్నందుకు గాను సినీ నటుడు సోనూ సూద్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక సోషల్ మీడియా ద్వారా వచ్చే అభ్యర్థనలకు కూడా ఆయన స్పందిస్తున్నారు. కష్టాల్లో ఉన్నామని చెబుతున్న వారికి సహాయం చేస్తూనే వారిని మానసికంగా బలోపేతం చేస్తున్నారు. నెటింట్లో సోనూ సూద్ ఇస్తున్న ప్రతిస్పందనలు నెటిజెన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదే వరుసలో ఓ వ్యక్తి చేసిన తుంటరి కామెంట్‌కు సోనూ సూద్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెటిజెన్లకు కట్టి పడేసింది.


ఓ నెటిజెన్ ‘‘సోనూ భాయ్.. నేను మా ఇంట్లో ఇరుక్కుపోయాను. లిక్కర్ షాప్‌ వరకు వెళ్లేందుకు నాకు సాయం చేయండి’’ అని కొంటెగా ట్వీట్ చేశాడు. దీనికి సోనూ సూద్ ‘‘భాయ్, నువ్వు షాపు నుంచి తిరిగి వచ్చేందుకు నేను నీకు సహాయం చేయగలను. నీకు అవసరం అయితే నాతో చెప్పు’’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇంకే ముంది, సోనూ రిప్లైకు సిగ్గుపడ్డ ఆ నెటిజెన్లు తిరిగి కామెంట్ చేయలేదు. ఇక నెటిజెన్లు సోనూ సూద్ సమయస్ఫూర్తిని, వ్యక్తిత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Updated Date - 2020-05-25T23:19:06+05:30 IST

Read more